'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
VSP: సిబ్బందికి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఐ.వాణి అన్నారు. స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్సులుగా పదోన్నతులు పొంది కేజీహెచ్‌లో నూతనంగా విధుల్లో చేరిన హెడ్ నర్స్ లు శనివారం సూపర్డెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రోగుల సేవల విషయంలో ఇబ్బందు లేకుండా విధి నిర్వహణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు.