డ్రగ్స్ మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దు: ఎస్సై

కోనసీమ: డ్రగ్స్ మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని కాట్రేనికోన ఎస్సై అవినాష్ సూచించారు. కాట్రేనికోన మండలం లక్ష్మీవాడలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రగ్స్ నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ ర్యాలీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. డ్రగ్స్ రవాణాపై సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కోరారు.