'అందరి సహకారంతోనే గుర్తింపు'

CTR: చిత్తూరు నగరపాలక అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషి, ప్రజాప్రతినిధుల సహకారంతోనే స్వచ్ఛ సర్వేక్షన్ 2024లో ఉత్తమ ర్యాంకు సాధించామని మేయర్ అముద, కమిషనర్ నరసింహ ప్రసాద్ చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2024 ఫలితాల్లో చిత్తూరు నగరపాలక సంస్థ మెరుగైన ర్యాంకులు సాధించడంతో శుక్రవారం సంస్థ కార్యాలయంలో సంబరాలు చేశారు.