VIDEO: ఎమ్మెల్యేల ఆటలు.. కిందపడ్డ ఆది శ్రీనివాస్
TG: హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్-2026 తొలి ఎడిషన్ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదటగా టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. రెండు జట్లుగా విడిపోయిన ఎమ్మెల్యేలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డి తాడును లాగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఒక్కసారిగా పడిపోయారు. అయితే ఆయనకు ఏమీ జరగకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.