నవజాత శిశు మరణాలను తగ్గించాలి: కలెక్టర్ రాజర్షి షా
ADB: నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన నవజాత శిశు సంరక్షణ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.నరేందర్ రాథోడ్, వైద్యులు, అధికారులు తదితరులున్నారు.