'మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి సాధ్యం'

'మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి సాధ్యం'

VZM : మేలైన యాజమాన్యం పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని గజపతినగరం ఉద్యానవన శాఖ అధికారి బి. దీప్తి అన్నారు. ఇవాళ బొండపల్లి మండలంలోని ముద్దూరు తమటాడ అంబటివలస గ్రామాల్లో గల మామిడి తోటలను దీప్తి పరిశీలించారు. ప్రస్తుతం పూమొగ్గలు ప్రారంభమయ్యే దశలో మామిడి పంట ఉన్నందున ఎటువంటి చర్యలు చేపట్టాలో రైతులకు వివరించారు.