భూమి అభివృద్ది పనులు చేపట్టాలి

భూమి అభివృద్ది పనులు చేపట్టాలి

MNCL: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూమి అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం చెన్నూర్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న లే అవుట్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి సంపత్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుమతుల ప్రకారం మాత్రమే అభివృద్ధి పనులు కొనసాగించాలని తెలిపారు.