VIDEO: మా ఊరి బావి ప్రత్యేకత ఇదే..!

VIDEO: మా ఊరి బావి ప్రత్యేకత ఇదే..!

BPT: కొరిశపాడు మండలం రాచపూడిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన నేల బావి ఉంది. 2,000కు పైగా జనాభా కలిగిన ఆ గ్రామ ప్రజలంతా ఇప్పటికీ తాగునీటి వనరుగా ఆ బావిని ఉపయోగించటం విశేషం. మారుతున్న కాలానికనుగుణంగా అందరూ మినరల్ వాటర్ సేవిస్తున్నప్పటికీ, తమ నేలబావి నీరు రుచికరంగా ఉండటంతో వారు ఆ నీటినే తాగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఊరి మొత్తానికి ఈ నేల బావి మంచి నీటికి ఆధారంగా మారిందంటున్నారు.