రైతు సంక్షేమానికి పెద్దపీట: గ్రంథాలయ ఛైర్మన్
MLG: రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గ్రంథాలయ ఛైర్మన్ బానోతు రవిచందర్ అన్నారు. జిల్లాలోని జీవంతరావుపల్లికి చెందిన రైతులకు సబ్సిడీతో మంజూరైన వ్యవసాయ పనిముట్లను ఛైర్మన్ పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.