VIDEO: అవగాహనతోనే నేరాల నియంత్రణ: ఎస్సై
SRPT: విద్యార్థులు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై అజయ్ కుమార్ సూచించారు. శనివారం మోతే మండలం కేజీబీవీలో పోలీసు కళాబృందంతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, వేధింపులకు గురైతే వెంటనే షీ-టీమ్స్‌ను ఆశ్రయించాలని కోరారు. చదువుతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ఆయన తెలిపారు.