పసుపు క్వింటా రూ.10,555
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,530 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.,4500 ధర పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,300 ధర వచ్చింది. మరో వైపు దీపిక మిర్చి క్వింటా రూ.14 వేలు, పసుపు రూ.10,555 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.