పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

NRML: తానూర్ మండలం ఏల్వత్ గ్రామంలో పిడుగు పాటుకు గురై మగీర్వాడ్ శ్రీ అనే బాలుడు, రాంజీ జాదవ్ కూలీ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వారి వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.