పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

MBNR: భూత్పూర్ మండల పీహెచ్‌సీలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం ఎంపీడీవో శ్రీదేవి, డీఎంహెచ్‌వో కృష్ణ ప్రారంభించారు. శిబిరంలో జనరల్ మెడిసిన్, దంత, కంటి, ఎముకల విభాగాల వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్తపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.