మైలార్ దేవ్ పల్లి పీఎస్‌లో ఆకస్మిక తనిఖీ
RR: రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మైలార్‌దేవ్ పల్లి పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిసెప్షనిస్ట్ పనితీరు, రిజిస్టర్ల నిర్వహణ, మౌలిక సదుపాయాలను ఆయన సమీక్షించారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.