సెప్టెంబర్‌లో సూర్యలంక బీచ్ ఫెస్టివల్

BPT: సూర్యలంక బీచ్‌లో వచ్చే నెల సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. దీనిపై బాపట్ల కలెక్టర్ వెంకట మురళీ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బీచ్‌ను సందర్శిస్తారన్నారు.