VIDEO: 'భూమిపై లావాదేవీలు నిలిపివేయాలి'
AKP: మాకవరపాలెం మండలం పీపీ అగ్రహారానికి చెందిన రైతు బొంతు రమణ నర్సీపట్నం పీజీఆర్ఎస్‌లో సోమవారం వినతిపత్రం సమర్పించారు. రాచపల్లి సర్వే నం.737 భూమిని తాను సాగు చేస్తున్నానట్లు తెలిపారు. పరిశ్రమల కోసం స్వాధీనం ప్రక్రియలో వివాదాలు ఉండగా, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. తుది తీర్పు వచ్చే వరకు భూమిపై లావాదేవీలు నిలిపివేయాలన్నారు.