'ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి'
JGL: తుఫాన్ తీవ్రత దృష్ట్యా మల్యాల మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నరేశ్ కుమార్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు గుంతలను గమనించాలని సూచించారు. చెరువులు, కుంటలు ఇప్పటికే నిండుకుండలా ఉన్నందున ఈ తుఫాన్ ప్రభావంతో మరింత ఉద్ధృతంగా మారనున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్త వహించాలన్నారు.