ప్రాచీన సంప్రదాయాలు, హస్తకళలు కాపాడాలి: కలెక్టర్
సత్యసాయి: ప్రాచీన సాంప్రదాయాలు, హస్త కళలను కాపాడాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ధర్మవరం మండలం నిమ్మలకుంటలో తోలుబొమ్మల కళాకారుడు దాలవాయి చలపతి రావు నివాసాన్ని సందర్శించారు. వారు తయారు చేసిన తోలు బొమ్మలు పరిశీలించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు.