విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాం: మంత్రి స్వామి

ప్రకాశం: కొండపి బాలుర ఎస్సీ హాస్టల్‌ని మంత్రి స్వామి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు, విద్యార్థుల గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేయిస్తున్నామన్నారు.