రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ
KNR: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేశారు. పంచాయతీ పాలకవర్గం వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్టు, హెల్మెట్, రోడ్డు భద్రత సూచికలు, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి మొగిలి, ఉప సర్పంచ్ దొంగల కుమార్ పాల్గొన్నారు.