బైకు అదుపుతప్పి.. యువకుడికి తీవ్రగాయాలు
అన్నమయ్య: తంబళ్లపల్లెలో కుక్క అడ్డు రావడంతో బైకు అదుపు తప్పి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తంబళ్లపల్లెకి చెందిన శ్రీనివాసులు (30) బైక్‌పై ములకలచెరువు రోడ్డుకు పనిపై బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలో స్కూటర్ బైక్‌కు అడ్డు రావడంతో అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.