ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. రేపటి నుంచి క్లాసులు
అన్నమయ్య: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8గంటల నుంచి మ.12.30 వరకు భోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. ఏప్రిల్ 23వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి.