భారత్‌కు అమెరికా నుంచి రూ.825 కోట్ల ఆయుధాలు
భారత్‌కు రూ.825 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ప్రాంతీయ ముప్పుల్ని ఎదుర్కొని రక్షణ రంగం పరంగా బలోపేతమయ్యేందుకు దోహదపడేలా ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ఎక్స్‌క్యాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్లు, జావెలిన్ యుద్ధ ట్యాంకుల విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఇందులో ఉంటాయి.