రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెం సమీపంలో ఒంగోలు-కర్నూలు రాష్ట్రీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనదారుడు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.