ప్రియురాలికి పెళ్లి.. ప్రియుడు సూసైడ్

ప్రియురాలికి పెళ్లి.. ప్రియుడు సూసైడ్

ప్రకాశం: కొండపి మండలం పెద్ద కండ్లకుంటలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. దాసరి మహేంద్ర కొండపిలోని ఓ టెంట్ హౌస్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బీసీ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు బుధవారం వివాహం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన మహేంద్ర గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.