ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: ఆదోని పట్టణంలో వర్షం వల్ల ఏర్పడిన ముంపు ప్రాంతాలను బుధవారం ఎమ్మెల్యే పార్థసారథి అధికారులతో కలిసి పరిశీలించారు. బసవేశ్వర కూడలి నుంచి శ్రీనివాస్ భవన్ వరకు రహదారులు, మురుగు కాలువలను పరిశీలిస్తూ ముంపు కారణాలు, నివారణ చర్యలపై చర్చించారు. ఆయన వెంట మున్సిపల్ ఇంజినీర్ సత్యనారాయణ, డీఈ రామ్మూర్తి, ఏఈలు తదితర అధికారులు ఉన్నారు.