VIDEO: షాద్ నగర్‌లో సదర్.. గుమ్మడి కాయతో దున్నపోతులకు పూజ
RR: సదర్ ఉత్సవాలకు షాద్ నగర్ పట్టణం ముస్తాబైయింది. పట్టణంలో ఆదివారం సదర్ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సదర్ ఉత్సవాలకు తీసుకొచ్చిన ప్రత్యేక దున్నపోతుకు సదర్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గుమ్మడికాయతో పూజ చేశారు. మరి కాసేపట్లో జరిగే ఉత్సవానికి దున్నపోతును ఊరేగింపుగా ముఖ్య కూడలికి తీసుకెళ్లనున్నారు.