సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందక ప్రైవేట్ ఆస్పత్రిల్లో చికిత్సలు పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరిటాల శ్రీరామ్ ఇవాళ అందజేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 7 మందికి రూ. 4.77 లక్షల విలువైన చెక్కులను పార్టీ కార్యాలయంలో అందజేశారు. లబ్ధిదారులు పరిటాల శ్రీరామ్‌కు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.