లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NZB: సిరికొండ మండలం కుర్దుల్ పేట్‌లో సోమవారం రూ. 2 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఉపసర్పంచ్ సతీష్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ ఉపసర్పంచ్ భూమన్న పాల్గొన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని వారు తెలిపారు.