వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన డైట్ ప్రకారం భోజనం అందించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.