చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

KDP: మైలవరం రిజర్వాయర్ గేట్ గోడపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలైన శివరామ సుబ్బయ్య (39) చికిత్స పొందుతూ మరణించాడు. మైలవరం గ్రామానికి చెందిన సుబ్బయ్య చేపల వేటతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 10న ప్రమాదం జరగగా, కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు.