రేపు నూజివీడు రానున్న మంత్రి సబిత
ELR: నూజివీడు పట్టణంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత రేపు పర్యటించనున్నట్లు సమాచార శాఖ అధికారులు ఇవాళ సాయంత్రం తెలిపారు. నూజివీడు పట్టణంలో రేపు ఉదయం 10:30 గంటలకు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ సభలో మంత్రి సవిత పాల్గొనున్నారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లికి మంత్రి సవిత ప్రయాణమవుతారని సమాచార శాఖ అధికారులు వివరించారు.