గ్రామదేవతలకు దీపాలు సమర్పించిన మహిళలు
CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్లలో గంగమ్మ జాతర వేడుకలు జరుగుతున్నాయి. బుధవారం వేకువ జామున మహిళలు భక్తిశ్రద్ధలతో సామూహికంగా గ్రామ దేవతలకు దీపాలను సమర్పించి వారి మొక్కలను చెల్లించుకున్నారు. తర్వాత అమ్మవారి దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.