అభివృద్ధికి అడ్డుపడితే ఉపేక్షించం: ఎమ్మెల్యే
TPT: చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడే వారిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఐతేపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని పేర్కొంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.