పెళ్లి కాలేదని యువకుడు బలవన్మరణం

NLR: పెళ్లి కావడం లేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కావలి మండలం ఆముదాలదిన్నెకు చెందిన రామయ్య(30) వివాహం కావడం లేదని చాలా రోజులుగా మనోవేదనకు గురై కుటుంబీకులు, బంధువులకు చెబుతున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కావలి ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.