'సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తా'
HNK: నారాయణగిరి గ్రామంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభను నిర్వహించారు. తహసీల్దార్ సదానందం, స్థానిక సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి సభకు హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ.. త్వరలో ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ వస్తున్నాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, గ్రామంలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.