మునుగోడు రావిగూడెం పాఠశాల దయనీయ పరిస్థితి
NLG: మునుగోడు మండలం రావిగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక వసతులే లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు రేకుల షెడ్డు కింద నేలపైనే కూర్చుని చదువుకుంటున్నామన్నారు. పాఠశాల ప్రాంగణం గుంతలమయంగా ఉండటంతో ఆటలకూ వీలు కావడం లేదని తెలిపారు. ఈ సమస్యలను తక్షణం పరిష్కరించాలని టీచర్లు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.