నీటి సంపులో పడి వృద్ధురాలి మృతి
WGL: వర్ధన్నపేట మండలం రామవరంలో ఇవాళ ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి గజ్జెల సౌందర్య (65) మృతి ఘటన చోటుచేసుకుంది. ఇంటి ఎదుట ఉన్న సంపులో నీరు తోడే సమయంలో బకెట్ పడిపోవడంతో దాన్నితీసే ప్రయత్నంలో కాలు జారి సుమారు 10ఫీట్ల లోతు ఉన్న సంపులో పడటంతో తలకుతీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.