ప్రధాని పర్యటన నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ప్రధాని పర్యటన నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

KRNL: ఈ నెల 16న ప్రధాని జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. నగరంలో 4,000 మందితో రోడ్ షో ఉండే అవకాశం ఉందన్నారు.