33వ డివిజన్ కార్పొరేటర్‌కు ఘన సత్కారం
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి శివరాజ్‌ను డివిజన్ వాసులు బుధవారం రాత్రి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. డివిజన్ వాసులు మాట్లాడుతూ.. జ్యోతి శివరాజ్ మళ్లీ గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని, డివిజన్ అభివృద్ధి వీరి వల్లే సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, సాజిద్, షరీఫ్, మోయిన్, కతల్ అజార్ పాల్గొన్నారు.