జామిలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

జామిలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

VZM: జామి మండలం రామభద్రాపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారాన్ని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సోమవారం నిర్వహించారు. ముందుగా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ దానిపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.శ్రీలక్ష్మి, వర్రి రమణ, పాల్గొన్నారు.