19న సబ్సిడీ రుణాల ఇంటర్వ్యూలు

NLR: సంగం మండలం నందు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎంపీడీవో షాలెట్ పలు సూచనలు చేశారు. సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీన సోమవారం సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు.