చెవిటికల్లులో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన
NTR: కంచికచర్ల మండలం చెవిటికల్లులో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మాణం కాబోతున్న వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులు సులభంగా వైద్య సేవలు పొందేందుకు అనువైన వేదిక అందుతుందని ఆమె చెప్పుకొచ్చారు.