రామాపురం గ్రామంలో విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

SRPT: నడిగూడెం మండలం రామాపురంలో గురువారం రాత్రి విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోపి తన మామిడి తోటలో మోటర్లకు విద్యుత్ కలెక్షన్ కోసం కరెంటు స్తంభం పైకి ఎక్కి మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై కిందపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.