జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం
ఖమ్మం నగరంలో విజయనగర్ కాలనీలో బుధవారం చైన్ స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి లాక్కుని పారిపోయాడు. మంకీ క్యాప్ ధరించిన దుండగుడు క్షణాల్లో ఉడాయించాడు. బాధితురాలు వెంటనే 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.