కొత్త జాలలో రేషన్ షాప్ ప్రారంభం
BHNG: రాజాపేట మండలం కొత్తజాలలో సోమవారం తాత్కాలిక రేషన్ షాపును గ్రామ సర్పంచ్ ఠాకూర్ లావణ్య ధర్మేందర్ సింగ్, తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాత్కాలిక రేషన్ షాప్ ఏర్పాటు చేయడంతో సరుకుల కోసం దూర భారం తగ్గిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఠాకూర్ ధన్ రాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.