డీసీసీబీలో అవినీతి ఆరోపణలు..!

డీసీసీబీలో అవినీతి ఆరోపణలు..!

VSP: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(DCCB)లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో కలకలం సృష్టిస్తోంది. పదోన్నతుల విషయంలో రూ.కోటి వరకు మామూళ్లు వసూల్లు చేశారన్న గుసగుసలు వినిపించాయి. బ్యాంకులో అక్రమాలపై అప్కాబ్‌కు ఫిర్యాదులు అందాయి. అన్ని విధాలుగా అర్హతలు ఉన్న వారిని పక్కన పెట్టి అర్హత లేని వారికి పదోన్నతులు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి.