MGM ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి సస్పెండ్
WGL: పట్టణంలోని MGM ఆసుపత్రిలో శస్త్రచికిత్సకు ముందు తల వెంట్రుకలు తొలగించేందుకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీను లంచం డిమాండ్ చేశాడు. జిల్లాకు చెందిన ఓ మహిళ తన బంధువు సర్జరీ నిమిత్తం వచ్చిన సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లంచం ఇస్తున్న దృశ్యాన్ని మహిళ మొబైల్‌లో రికార్డు చేసి ఉన్నతాధికారులకు పంపించడంతో శ్రీనును ఉన్నతాధికారులు వెంటనే తొలగించారు.