హోలీ సంబరాల్లో విషాదం.. విద్యార్థి మృతి

హోలీ సంబరాల్లో విషాదం.. విద్యార్థి మృతి

NLG: దేవరకొండ ఉప్పవాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తికేయన్ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్నారు. అతని తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చనిపోయాడు. మరో విద్యార్థి శ్రీనివాసచారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.