ఆమిటి-తెర్లాం రోడ్డుకు రూ.1.46 కోట్లు మంజూరు

VZM: ఆమిటి-తెర్లాం రోడ్డు నిర్మాణానికి రూ.1.46 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. తెర్లాం మండలం ఆమిటి వెళ్లాలంటే రోడ్డు బాగోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే బేబినాయన స్పందించి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో నాబార్డు నిధులు మంజూరు చేపించారు. దీంతో రోడ్డును నాబార్డు అధికారులు పరిశీలించారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.